దీపావళి సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య నగరంలోని సరయు నది తీరం లక్షల దీపాలతో వెలిగిపోయింది. ఒకేసారి 6లక్షల 6వేల 569 దీపాలు అయిదు నిమిషాల పాటు రామ్‌కీ పైడీ ఘాట్ల వద్ద కాంతులీనాయి. యూపీ సర్కార్ తలపెట్టిన ఈ దీపోత్సవం గిన్నీస్ బుక్ రికార్డునూ సొంతం చేసుకుంది. తాజాగా ఆ రాష్ట్ర పర్యాటక రంగానికి, రామ్ మనోహర్ లోహియా అవథ్ విశ్వవిద్యాలయానికి గిన్నిస్ బుక్ సభ్యులు అభినందనలు తెలిపారు. 6,06,569 చమురు దీపాలు అయిదు నిమిషాల పాటు వెలుగొందాయంటూ ట్వీట్ చేయడం సహా.. ఆ సుందర దృశ్యాలను షేర్ చేశారు.
సీఎం అభినందనలు..