రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో 'మధ్యవర్తి' అభియోగాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని శుక్రవారం పేర్కొంది. ఒప్పందంతో దేశ ఖజానాకు రూ.21,075 కోట్ల నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు.
"దేశ అతిపెద్ద రక్షణ ఒప్పందంలో మోదీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయగలిగే శక్తి.. ప్రైవేటు వ్యక్తులు, మధ్యవర్తులకు ఎలా లభించింది? దానిపై సమగ్ర స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం లేదా? ఇక సర్కారు దీనిని ఎంతమాత్రం దాచలేదు. దేశ ప్రజలకు కచ్చితంగా జవాబు చెప్పితీరాలి."
- రణ్‌దీప్ సూర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి