రాజస్థాన్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకుంది. మొత్తం 4,371 పంచాయతీ సమితి సీట్లలో 1852 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. భాజపా ఏకంగా 1,989 సీట్లు కైవసం చేసుకుంది.
సీపీఎం 26, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) ఆరు, బహుజన్ సమాజ్ పార్టీ ఐదు స్థానాలు గెలుచుకోగా.. స్వతంత్రులు 439 స్థానాల్లో విజయం సాధించారు.
జిల్లా పరిషత్ స్థాయిలోనూ హస్తం పార్టీ చతికిలపడింది. 635 స్థానాలకు కాంగ్రెస్ 252 చోట్ల గెలుపొందగా.. భాజపా అభ్యర్థులు 353 స్థానాల్లో విజయం సాధించారు. 13 జిల్లా బోర్డుల్లో భాజపా మెజారిటీ సాధించింది ఉంది. ఆర్ఎల్పీ మద్దతుతో మరో జిల్లా స్థానాన్ని గెలుచుకొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ను ఐదు జిల్లాల్లోనే విజయం వరించింది.