తెలంగాణ

telangana

ETV Bharat / bharat

' 'గడ్కరీ లగ్జరీ బస్సు'పై న్యాయ విచారణ జరిపించాలి' - Scania bus scam

స్వీడన్​కు చెందిన సంస్థ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సంబంధమున్న కంపెనీకి లగ్జరీ బస్సును కానుకగా ఇచ్చిందనే ఆరోపణలొచ్చాయి. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎప్పుడూ నిజాయతీ గురించి మాట్లాడే ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ విషయంపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించింది. మరోవైపు నితిన్​ గడ్కరీ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.

Cong seeks judicial inquiry into charges against Gadkari
' 'గడ్కరీ కంపెనీకి లగ్జరీ బస్సు'పై న్యాయ విచారణ జరిపించాలి'

By

Published : Mar 12, 2021, 10:23 AM IST

Updated : Mar 12, 2021, 12:02 PM IST

కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీతో సంబంధాలున్న ఓ కంపెనీకి.. స్వీడన్​కు చెందిన ప్రముఖ తయారీ సంస్థ స్కేనియా ఓ లగ్జరీ బస్సును కానుకగా ఇచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై కాంగ్రెస్​ స్పందించింది. గడ్కరీపై న్యాయవిచారణ జరిపించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనేత్ డిమాండ్ చేశారు.

"బస్సు కుంభకోణ కాంట్రాక్టుకు సంబంధించి వస్తున్న వార్తలు ఆందోళనకరం. ఎప్పుడూ నిజాయితీ గురించి మాట్లాడే ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ విషయంపై మౌనం వహించాల్సి వస్తోంది. ఆయన దీనిపై మాట్లాడేందుకు కూడా సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తుందని భావిస్తున్నాం. ఇతర కుంభకోణాల్లా దీన్ని కూడా కప్పేసే ప్రయత్నం చేయొద్దు"

-సుప్రియ శ్రీనేత్​

గడ్కరీకి సంబంధమున్న కంపెనీ సీఈఓ, ఇతర ఉన్నతాధికారులతో ఆయన దిగిన ఫొటోలను కూడా కాంగ్రెస్ షేర్ చేసింది.

నిరాధారం..

అయితే ఈ ఆరోపణలను నితిన్ గడ్కరీ ఖండించారు. ఇవన్నీ కల్పిత, నిరాధార ఆరోపణలని ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ అంశం స్కేనియా సంస్థ అంతర్గత వ్యవహారమని, గడ్కరీకి గానీ, ఆయన కుటుంబీకులకు గానీ బస్సు కొనుగోళ్లతో ఎలాంటి సంబంధం లేదని స్కేనియా సంస్థ అధికార ప్రతినిధి స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించింది.

ఇదీ చూడండి:మమతా బెనర్జీ ఆస్తుల విలువెంతో తెలుసా?

Last Updated : Mar 12, 2021, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details