తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తమిళనాట 25 స్థానాల్లో బరిలోకి దిగనున్న కాంగ్రెస్.. 21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ఈ జాబితాను విడుదల చేసింది.
కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించింది. భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్శిటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ వీ విజయ్‌కుమార్ పోటీ చేయనున్నట్లు పేర్కొంది.