తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్ పార్టీకి రూ. 139 కోట్ల విరాళాలు - సోనియా గాంధీ

కాంగ్రెస్​ పార్టీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 139 కోట్ల విరాళాలు స్వీకరించింది. ఇందులో అత్యధిక వ్యక్తిగత విరాళంగా పార్టీ సీనియర్​ నేత కపిల్​ సిబల్​ రూ. 3 కోట్లు పార్టీ నిధికి ఇచ్చారు.

Cong received over Rs 139 crore in donations
కాంగ్రెస్ పార్టీకి రూ. 139 కోట్ల విరాళాలు

By

Published : Feb 5, 2021, 7:37 AM IST

2019-20 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ 139 కోట్ల రూపాయల విరాళాలను అందుకుంది. ఈ మేరకు వివరాలను వెల్లడించిన ఎన్నికల సంఘం.. కాంగ్రెస్‌ పార్టీకి ఆ కాలంలో అత్యధికంగా ప్రుడెంట్‌ ఎలక్ట్రోరల్‌ ట్రస్ట్‌ 31 కోట్ల రూపాయలు, ఐటీసీ దాని అనుబంధ కంపెనీలు 19 కోట్ల రూపాయల విరాళాలు అందజేసినట్లు తెలిపింది.

సొంత పార్టీ నేతల్లో అత్యధికంగా కపిల్‌ సిబల్‌ రూ. 3 కోట్లు విరాళం అందజేయగా, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ లక్షా 8వేల రూపాయలు ఇచ్చారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 50వేల రూపాయలు, ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ 54వేల రూపాయల విరాళం అందజేశారు.

ఇదీ చూడండి: బాలీవుడ్ ట్విట్టర్​ వార్​ వయా రైతు నిరసనలు

ABOUT THE AUTHOR

...view details