తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​కు ఎదురుదెబ్బ- ఆ పీసీసీ చీఫ్ రాజీనామా - manipur congress resign

మణిపుర్​ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గోవిందాస్ కొంతౌజం రాజీనామా చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. పార్టీని అధ్యక్షుడు వీడటం చర్చనీయాంశంగా మారింది. ఆయనతో పాటు మరో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరే అవకాశం ఉంది.

cong-manipur-unit-pres-quits-8-members-likely-to-join-bjp-today
కాంగ్రెస్​కు దెబ్బ- మణిపుర్ పీసీసీ చీఫ్ రాజీనామా

By

Published : Jul 20, 2021, 10:30 AM IST

మణిపుర్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభం తలెత్తింది. మణిపుర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(ఎంపీసీసీ) అధ్యక్ష పదవికి గోవిందాస్ కొంతౌజం రాజీనామా చేశారు. ఆయనతో పాటు దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు మంగళవారం భాజపాలో చేరునున్నట్లు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉన్న వేళ గోవిందాస్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బే అని తెలుస్తోంది. మణిపుర్‌ పీసీసీ అధ్యక్షుడిగా గత ఏడాది డిసెంబర్‌లో గోవిందాస్‌ కొంతౌజం నియమితులయ్యారు. నెల క్రితం వరకు కూడా అధికార భాజపా, సీఎం బీరెన్‌ సింగ్‌పై విమర్శలు గుప్పించిన గోవిందాస్‌.. అనుహ్యాంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి:పౌర స్వేచ్ఛకు విఘాతం.. సెక్షన్​ 124-ఎ

ABOUT THE AUTHOR

...view details