పీఎం కేర్స్ నిధికి అందిన విరాళాలపై లోక్‌సభలో.. ప్రభుత్వం- ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య సోమవారం తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. కరోనా సంక్షోభం సమయంలో ప్రజలకు లబ్ధి చేకూర్చడానికి బదులు ప్రభుత్వానికి.. ఎల్ఐసీ నిధులిచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను తిప్పికొడుతూ.. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనా నుంచి నిధులొచ్చాయని విమర్శించారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.
పీఎం కేర్స్ విరాళాలపై లోక్‌సభలో గందరగోళం - కాంగ్రెస్
పీఎం కేర్స్ విరాళాలపై లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. కరోనా సంక్షోభంలో ప్రజలను ఆదుకోవడం మాని, పీఎం కేర్స్‌కు ఎల్ఐసీ డబ్బులిచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా చైనా నుంచి కాంగ్రెస్ నిధులు పొందిందని విమర్శించారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.
పీఎం కేర్స్‌పై లోక్‌సభలో రచ్చ
లాక్డౌన్లో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత రవ్నీత్ సింగ్ విమర్శించారు. బదులుగా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరించారు అనురాగ్. ఈ నేపథ్యంలో.. ఒక కుటుంబం మాత్రం రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా తన ఖాతాలను నింపుకుందని ఆరోపించారు.
ఇదీ చూడండి:'శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరి పోరు!'