బంగాల్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. వామపక్షాలతో ఎన్నికల పొత్తును ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ రంజన్ చౌదురీ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
బంగాల్ బరిలో కూటమిగా కాంగ్రెస్, వామపక్షాలు
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్- వామపక్షాలు కలిసిపోటీ చేయనున్నాయి. ఈ మేరకు లెప్ట్ పార్టీలతో పొత్తును ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదురీ అధికారికంగా ప్రకటించారు.
బంగాల్ బరిలో కూటమిగా కాంగ్రెస్, వామపక్షాలు
లెఫ్ట్ పార్టీలతో పొత్తు ఉండాలని పశ్చిమ బంగా పీసీసీ ఇటీవల పార్టీ అధిష్ఠానానికి సిఫారసు చేయటంతో.. అందుకు ఏఐసీసీ ఆమోదముద్ర వేసినట్లు అధీర్ రంజన్ చౌదురీ తెలిపారు. పశ్చిమబంగా శాసనసభ ఎన్నికలు మార్చి-ఏప్రిల్ మాసాల్లో జరగాల్సి ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి.