తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పీఎం కేర్స్​ విదేశీ విరాళాలపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం - పీఎం కేర్స్ రణదీప్ సుర్జేవాలా

'పీఎం కేర్స్' విరాళాల విషయంపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం కురిపించింది. విదేశాల నుంచి అందిన విరాళాల వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేసింది. ఈ నిధుల విషయంలో జవాబుదారీగా ఉండాలని కేంద్రానికి సూచించింది.

cong-demands-account-of-foreign-donations-received-by-pm-cares-fund
పీఎం కేర్స్​పై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం

By

Published : Dec 17, 2020, 5:14 AM IST

పీఎం కేర్స్ నిధిపై జవాబుదారీతనంతో వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ సూచించింది. ఇప్పటివరకు ఆ నిధికి విదేశాల నుంచి వచ్చిన విరాళాల లెక్క చెప్పాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

సూర్జేవాలా సంధించిన ప్రశ్నలివీ..

  • భారత దౌత్య కార్యాలయాలు పీఎం కేర్స్ నిధిపై ఎందుకు ప్రచారం చేస్తున్నాయి? ఎందుకు విరాళాలు సేకరిస్తున్నాయి?
  • నిషేధిత చైనా యాప్​లో ఈ నిధి గురించి ఎందుకు ప్రచారం చేశారు?
  • పాకిస్థాన్, కతర్ నుంచి పీఎం కేర్స్​కు ఎంత సొమ్ము అందింది? ఆ డబ్బును అందజేసిందెవరు?
  • 27 దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాలు ఈ నిధిపై బహిరంగంగా కాకుండా గుట్టుగా ఎందుకు ప్రచారం చేస్తున్నాయి?
  • విదేశీ విరాళాల నియంత్రణ చట్టం( ఎఫ్​సీఆర్ఎ) నుంచి సీఎం కేర్స్ ఎందుకు మినహాయింపునిచ్చారు?

ABOUT THE AUTHOR

...view details