వ్యాక్సినేషన్ విషయమై కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. టీకా పంపిణీ కార్యక్రమంలో 'భారత్ ప్రథమం' అన్న విధానాన్ని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు అనుసరించడం లేదని ప్రశ్నించింది. దేశంలో పౌరులను పక్కన పెట్టి 6 కోట్ల డోసులు ఎందుకు విదేశాలకు ఎగుమతి చేశారని ఆ పార్టీ అధికార ప్రతినిధి శక్తి సింహా గోహిల్ వ్యాఖ్యానించారు.
టీకా విషయంలో కేంద్రం పారదర్శక విధానాన్ని అమలు చేయాలని గోహిల్ డిమాండ్ చేశారు. తొలుత భారత పౌరులకు వ్యాక్సిన్ అందించాలని సూచించారు. టీకా విషయంలో భారతీయులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పార్లమెంటరీ స్థాయి సంఘం గతేడాది అక్టోబర్‌లోనే చెప్పిందని గోహిల్ గుర్తు చేశారు. తమ పౌరులకే ప్రథమ ప్రాధాన్యం విధానంతో అమెరికా సహా అనేక దేశాలు తమ పౌరులను టీకా ఇచ్చాయన్నారు.