రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu-Sonia phone conversation).. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. భాజపాను ఎదుర్కొనేందుకు.. ఒకే రకమైన భావజాలాలున్న పార్టీలను ఏకం చేయాలని, దీనికి సోనియానే (Sonia gandhi news) నేతృత్వం వహించాలని కోరినట్లు (Lalu yadav news) పేర్కొన్నారు.
బిహార్లో అక్టోబర్ 30న ఉపఎన్నికలు జరగనున్న తారాపుర్, కుశేశ్వర్ ఆస్థాన్ నియోజకవర్గాల్లో ప్రచారానికి బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అవన్నీ అసత్యాలే..
అయితే.. లాలూ(Lalu yadav news) చెప్పినవి అన్నీ అసత్యాలేనని, సోనియాతో ఎలాంటి సంభాషణ జరగలేదని ఆరోపించారు రాష్ట్ర ఏఐసీసీ ఇంఛార్జ్ భక్త్ చరణ్ దాస్. అది జరిగి ఉంటే తనకు సమాచారం అందేదని అన్నారు.
ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్- ఆర్జేడీ పొత్తు అంశం తెరపైకి వచ్చింది. విలేకరుల ప్రశ్నలకు బదులిచ్చిన దాస్.. ఉపఎన్నికల ప్రచారానికి ఒక్కరోజు ముందు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే లాలూ ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు. రెండు పార్టీల మధ్య ఎలాంటి సయోధ్య(Lalu-Sonia phone conversation) కుదరలేదని చెప్పారు.