తెలంగాణ

telangana

పది నెలల్లో 13 మంది బలి.. ఎట్టకేలకు చిక్కిన 'సీటీ-1' పులి

10 నెలల్లో 13 మందిని చంపి వణుకు పుట్టించిన పులిని ఎట్టకేలకు పట్టుకున్నారు మహారాష్ట్ర అటవీ అధికారులు. ఈ పులి డిసెంబరు నుంచి సంచరిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. సీటీ-1గా పేరు పెట్టిన ఈ వ్యాఘ్రాన్ని ఎలాగైనా పట్టుకోవడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

By

Published : Oct 14, 2022, 6:55 AM IST

Published : Oct 14, 2022, 6:55 AM IST

conflict-tiger-that-killed-13-persons-captured-in-gadchiroli-mahasrastra
conflict-tiger-that-killed-13-persons-captured-in-gadchiroli-mahasrastra

మహారాష్ట్రలో 10 నెలల్లో 13 మందిని చంపి వణుకు పుట్టించిన పులిని ఎట్టకేలకు పట్టుకున్నారు. గడ్చిరోలి, చంద్రాపుర్‌ జిల్లాల్లో ఈ పులి డిసెంబరు నుంచి సంచరిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. సీటీ-1గా పేరు పెట్టిన ఈ వ్యాఘ్రాన్ని ఎలాగైనా పట్టుకోవడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే గురువారం వాడ్సా అటవీప్రాంతంలో దాని ఆచూకీని గుర్తించి మత్తుమందు ఇచ్చి పట్టుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పునరావాసం కోసం ఈ పులిని వాడ్సా రేంజ్‌ నుంచి 183 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్‌పుర్‌లోని గోరెవాడ రెస్క్యూ సెంటర్‌కు తరలించినట్లు వెల్లడించారు.

కొద్దిరోజుల క్రితం బిహార్‌లో మనుషుల రక్తానికి రుచి మరిగిన పెద్దపులిని ఎట్టకేలకు షార్ప్‌ షూటర్లు మట్టుబెట్టారు. చంపారన్‌ జిల్లాలోని బగాహ అనే గ్రామంపై పులి దాడి గ్రామస్థులను చంపుతోంది. ఇప్పటివరకు 9 మందిని పొట్టనపెట్టుకుంది. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు కొన్నివారాల నుంచి పులిని బంధించేందుకు ఏనుగులతో గాలించినా జాడ కనిపించలేదని అటవీ సిబ్బంది తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే నలుగురిని చంపినట్లు చెప్పారు. బిహార్‌ ప్రభుత్వం అనుమతి తీసుకొని షార్ప్‌ షూటర్లతో పులిని చంపినట్లు అటవీ సిబ్బంది వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details