తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాటన్​కు బదులు కండోమ్ కవర్లతో చికిత్స, పీహెచ్​సీ సిబ్బంది నిర్లక్ష్యం - మురేనా క్రైం న్యూస్

తలకు గాయమైన ఓ మహిళకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది చేసిన వైద్యం చర్చనీయాంశంగా మారింది. మహిళకు గాయం నుంచి రక్తం ఆగడానికి కండోమ్ కవర్​ను పెట్టి కట్టు వేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

Condom wrapper used for bandage
కండోమ్ కవర్​ను గాయానికి అడ్డుగా పెట్టి కుట్లు

By

Published : Aug 20, 2022, 7:26 PM IST

Updated : Aug 20, 2022, 7:43 PM IST

తలకు గాయమైన ఓ మహిళకు కండోమ్ కవర్​ను పెట్టి కట్టు కట్టారు పోర్సా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది. మధ్యప్రదేశ్‌.. మురేనాలో ఈ ఘటన జరిగింది. రక్తం అదుపు కాకపోవడం వల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మహిళను పంపించగా.. కండోమ్ కవర్ విషయం వెలుగులోకి వచ్చింది. అసలేమైందంటే..

ధరమ్‌గఢ్ గ్రామానికి చెందిన బాధిత మహిళ తలకు ప్రమాదవశాత్తు గాయమైంది. దీంతో వైద్యం చేయించుకొనేందుకు స్థానిక పీహెచ్​సీకి వెళ్లింది. ఆమె తలకు కట్టుకట్టి పైఆస్పత్రికి పంపించారు అక్కడి సిబ్బంది. కాగా, గాయపడిన మహిళకు కుట్లు వేసేందుకు కట్లు విప్పిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు.. పోర్సా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్వాకం బయటపడింది. బాధితురాలి గాయాలకు కండోమ్ కవర్ పెట్టి కట్లు కట్టినట్లు తేలింది. దీంతో ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. దూదితో కట్లు వేయడానికి బదులుగా కండోమ్ కవర్​ను అడ్డుగా పెట్టి కట్టు వేయడంపై ఆరోగ్యశాఖ అధికారులు మండిపడ్డారు.

కండోమ్ కవర్​ను గాయానికి అడ్డుగా పెట్టి కట్లు

దారుణంగా పరిస్థితులు..
మురేనా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల పరిస్థితి దారుణంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది సాధారణ గాయాలకు కూడా చికిత్స చేయలేక.. రోగులను జిల్లా ఆసుపత్రికి పంపుతున్నారని మండిపడ్డారు.

ఇవీ చదవండి:2024 ఎన్నికల్లో మోదీ కేజ్రీవాల్ మధ్యే పోటీ, అందుకే సీబీఐ దాడులు

విద్యార్థినిపై అరాచకాలు, ట్యూషన్ టీచర్​కు దేహశుద్ధి, రోడ్డుపై ఈడ్చుకుంటూ

Last Updated : Aug 20, 2022, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details