తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నైరుతి రుతుపవనాలు రేపు రావడం ఖాయం! - కేరళలో నైరుతి రుతుపవనాలు

కేరళను గురువారం నైరుతి పవనాలు తాకనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పరిస్థితులు వర్షాలకు అనుగుణంగా ఉన్నాయని.. ఈ క్రమంలోనే నైరుతి పవనాలు కూడా కేరళ చేరతాయని పేర్కొంది.

kerala monsoon, కేరళ రుతుపవనాలు
కేరళ నైరుతి రుతుపవనాలు

By

Published : Jun 2, 2021, 2:08 PM IST

నైరుతి రుతుపవనాలు జూన్​ 3న కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షం కురిసే సూచనలు పెరిగాయని, దక్షిణ అరేబియా సముద్రంలో పశ్చిమ గాలులు బలపడ్డాయని పేర్కొంది. కేరళ తీరం, సమీప సముద్ర ప్రాంతంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

"ప్రస్తుత పరిస్థితులు కేరళలో వర్షాలు పడేందుకు అనుకూలంగా ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి."

-వాతావరణ శాఖ

రాష్ట్రంలో నైరుతి పవనాలు జూన్​ 1నే వస్తాయని వాతావరణ శాఖ ఇదివరకు అంచనా వేసింది. కానీ ఆ తర్వాత అందుకు పరిస్థితులు అనుకూలంగా లేవంటూ ప్రకటించింది. ఇప్పుడు మూడు రోజులు ఆలస్యంగా వస్తున్నాయని తెలిపింది.

ఇదీ చదవండి :సీఎం ఆధ్వర్యంలో ఆన్​లైన్​ క్లాసులు షురూ

ABOUT THE AUTHOR

...view details