అఫ్గానిస్థాన్(Afghanistan Taliban) భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించకుండా చూడటంపైనే ప్రస్తుతం దృష్టిసారించినట్లు తెలిపింది విదేశాంగ శాఖ. తాలిబన్ల ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం, దాని స్వభావంపై ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్ నాయకుడు షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టెనెక్జాయ్తో.. భారత రాయబారి దీపక్ మిత్తల్ భేటీ(India Taliban Talks) అయిన రెండు రోజుల తర్వాత ఈ మేరకు స్పందించింది.
"అఫ్గాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై ఆందోళనలను తెలియజేయటం, అఫ్గాన్‌లోని భారతీయుల భద్రత, వారిని వెనక్కి రప్పించటం కోసమే దోహాలో భారత్ సమావేశమైంది. వారి నుంచి సానుకూల స్పందన వచ్చింది."
- అరిందమ్ బాగ్చీ, విదేశాంగ శాఖ ప్రతినిధి.