తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డబ్బుల కోసం కిడ్నాప్ డ్రామా.. చివరకు? - డా. ఎస్పీ సింగ్

ప్రైవేటు ఆసుపత్రి కాంపౌండర్​గా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. తన యజమాని కుమార్తెలను కిడ్నాప్​ చేసి డబ్బులు కావాలని బెదిరించాడు. అయితే.. సమాచారం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా బాధితులను రక్షించి నిందితుడిని అరెస్టు చేశారు.

compounder plays kidnap drama in meerut
డబ్బుల కోసం కిడ్నాప్ డ్రామా.. చివరకు?

By

Published : Apr 1, 2021, 7:22 PM IST

ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే ఓ కాంపౌండర్ కిడ్నాప్​ డ్రామా విఫలమైంది. తన యజమాని నుంచి డబ్బులు లాగాలని నిందితుడు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​లో జరిగింది.

ఇదీ జరిగింది..

మేరఠ్​లోని అనుదేవ్​ నర్సింగ్​ హోమ్​లో ఐదేళ్లనుంచి కాంపౌండర్​గా పనిచేస్తున్నాడు తప్​రాజ్. ఆ ఆసుపత్రి యజమాని డాక్టర్ ఎస్పీ సింగ్.. కుటుంబంతో సహా నర్సింగ్​ హోమ్​ ఉన్న భవనంలోని రెండో అంతస్తులో నివాసముంటున్నారు. ఈ క్రమంలో ట్యాంక్​లో నీళ్లు చూసేందుకు వెళ్లిన కాంపౌండర్​ కిడ్నాప్​ డ్రామా ఆడాడు.

ఆసుపత్రి

డా. ఎస్పీ సింగ్ ఇద్దరు కుమార్తెలను కత్తితో బెదిరించి వారిద్దరినీ ఓ గదిలో బంధించాడు తప్​రాజ్. తర్వాత రూ.ఐదు లక్షలు కావాలంటూ ఎస్పీ సింగ్​కు ఫోన్​ చేశాడు. గదిలోని బీరువా తాళం ఇవ్వాలని బెదిరించాడు. వెంటనే తాను చెప్పింది చేయకపోతే ఇద్దరు కుమార్తెలను హతమార్చుతానని అన్నాడు.

కుమార్తెలతో డా. ఎస్పీ సింగ్

వెంటనే గంగానగర్ పోలీసులకు సమాచారం అందించారు ఎస్పీ సింగ్. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చాకచక్యంతో నిందితుడిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి తప్​రాజ్​ను అరెస్టు చేశారు.

చాకచక్యంగా ప్రవర్తించిన పోలీసులు

అప్పుల బాధ వల్లే..

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తనకు వివాహం జరిగిందనట్లు తెలిపిన తప్​రాజ్​.. ఈ కిడ్నాప్​ డ్రామా ఆడేందుకు కారణమేంటో వివరించాడు. తన తల్లి ఆరోగ్యం విషమించిన కారణంగా 8 లక్షల వరకు అప్పు అయిందని పోలీసుల విచారణలో చెప్పాడు. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేందుకే ఈ చర్యకు పాల్పడినట్లు పేర్కొన్నాడు.

స్వల్పగాయాలతో డాక్టర్ కుమార్తె
నిందితుడు తప్​రాజ్

ఇదీ చదవండి:'దీదీ.. ఇంకో స్థానం నుంచి పోటీ చేస్తారా?'

ABOUT THE AUTHOR

...view details