అమెరికా వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌లో జరిగిన హింసాకాండలో పాల్గొన్న భారత సంతతి వ్యక్తిపై దిల్లీలోని కాలకాజీ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. భారత జాతీయ జెండాని పట్టుకుని హింసాత్మక ఘటనలో పాల్గొనడమే ఇందుకు కారణమని పోలీసులు వివరించారు. ఆందోళనల్లో పాల్గొనే వ్యక్తి త్రివర్ణ పతాకాన్ని తీసుకెళ్లడం అనేది జాతీయతకు సంబంధించిన విషయమని తెలిపారు.
'క్యాపిటల్'లో త్రివర్ణపతాకం- వ్యక్తిపై కేసు - INDIAN FLAG HOIST IN THE US CAPITOL PROTESTS
అగ్రరాజ్యంలోని క్యాపిటల్ భవనంలో వీరంగం సృష్టించిన ట్రంప్ మద్దతుదారుల్లో ఒకరిపై దిల్లీలో కేసు నమోదైంది. భారత సంతతికి చెందిన వ్యక్తి నిరసనల్లో జాతీయ జెండాని పట్టుకుని పాల్గొనడమే ఇందుకు కారణం అని పోలీసులు వివరించారు.
!['క్యాపిటల్'లో త్రివర్ణపతాకం- వ్యక్తిపై కేసు COMPLAINT WAS FILED AT THE KALKAJI POLICE STATION AGAINST THE INDIAN FLAG HOIST IN THE US CAPITOL PROTESTS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10176205-thumbnail-3x2-jjj11.jpg)
అమెరికా నిరసనల్లో త్రివర్ణపతాకం-వ్యక్తిపై కేసు నమోదు
అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కనిపించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతని వయసు సుమారు 54ఏళ్లుగా ఉండొచ్చని తెలిపారు.
Last Updated : Jan 9, 2021, 2:07 PM IST