మహారాష్ట్ర జల్గావ్ ఘటనపై దర్యాప్తు చేపట్టిన కమిటీ.. తమ నివేదికను సమర్పించింది. హాస్టల్ బాలికలతో కొందరు పోలీసులు నగ్నంగా నృత్యం చేయించిన ఘటనేదీ జరగలేదని ఆరుగురు సభ్యులు ఆ నివేదికలో పేర్కొన్నట్టు.. హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ వెల్లడించారు. కేవలం వినోద కార్యక్రమాలు మాత్రమే నిర్వహించారని చెప్పారు. ఆ హాస్టల్లోని మతిస్తిమితం సరిగ్గాలేని కొందరు బాలికలే ఇలా ఫిర్యాదు చేశారని తెలిపారు.
'ఆ హాస్టల్లో నగ్న నృత్యాలు జరగలేదు' - జల్గావ్ హాస్టల్ కేసుపై దర్యాప్తు
మహారాష్ట్ర జల్గావ్ హాస్టల్ ఘటనపై సంచలన విషయాలు బయటికొచ్చాయి. బాలికలతో నగ్నంగా నృత్యం చేయించడం వంటి ఘటనలేవీ అసలు అక్కడ జరగలేదని ప్రభుత్వానికి దర్యాప్తు కమిటీ నివేదిక సమర్పించింది.
'జల్గావ్ హాస్టల్లో అలాంటి ఘటనేదీ జరగలేదు'
జల్గావ్లో కొందరు పోలీసులు.. హాస్టల్ విద్యార్థినులను బలవంతంగా నగ్న నృత్యాలు చేయించారని ఆరోపించారు అక్కడి బాలికలు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ బుధవారం ఆదేశించారు.
ఇదీ చదవండి:'రైతు మద్దతుదారులపై మోదీ సర్కార్ దాడులు'