తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అసెంబ్లీ ఎన్నికల తర్వాత కనీస మద్దతు ధరపై కమిటీ'

MSP panel: కనీస మద్దతు ధరపై కమిటీకి కేంద్రం కట్టుబడి ఉందని వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఎన్నికల తర్వాత దీన్ని ఏర్పాటు చేయాలని ఎలక్షన్ కమిషన్​ సూచించిందని రాజ్యసభలో వెల్లడించారు.

MSP panel
నరేంద్ర సింగ్ తోమర్​

By

Published : Feb 4, 2022, 12:13 PM IST

MSP panel: కనీస మద్దతు ధరపై కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభలో వెల్లడించారు. ఎన్నికల తర్వాతే ప్యానెల్​ ఏర్పాటు చేయాలని ఎలక్షన్​ కమిషన్ సూచించినందు వల్ల ప్రక్రియ తాత్కాలికంగా ఆగినట్లు చెప్పారు.

మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది నవంబర్​లో ప్రకటించారు. అప్పుడే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయంపై కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కమిటీ ఏర్పాటును కేంద్రం పరిశీలిస్తోందని, అయితే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాతే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. మోదీ చేసిన ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉందని మరోమారు స్పష్టం చేశారు.

డీఎంకే సభ్యుల వాకౌట్​..

అంతకుముందు తమిళనాడు గవర్నర్‌ చర్యను నిరసిస్తూ డీఎంకే సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. సభ ప్రారంభం కాగానే తమ సీట్ల నుంచి లేచిన డీఎంకే నేతలు..ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగే చర్చ సందర్భంగా సంబంధిత అంశాన్ని ప్రస్తావించాలని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సూచించినప్పటికీ వారు శాంతించలేదు. చివరికి సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు డీఎంకే సభ్యులు ప్రకటించారు.

వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ ఇటీవల అక్కడి శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపగా ఆయన తిప్పి పంపారు.

ఇదీ చదవండి:30వేల మద్యం బాటిళ్ల ధ్వంసం.. విలువ రూ.కోటిపైనే..

ABOUT THE AUTHOR

...view details