భారత్, బంగ్లాదేశ్ మధ్య దాదాపుగా 50 ఏళ్ల తర్వాత గూడ్స్ రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. హల్దిబాడీ-ఛిలహతి మార్గాన్ని పునరుద్ధరించిన తర్వాత మొదటిసారిగా ఓ గూడ్స్ రైలు బయలుదేరింది.
2020 డిసెంబర్ 17న ప్రధాని మోదీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా.. ఈ మార్గాన్ని పునః ప్రారంభించారు. అయితే.. కరోనా కారణంగా ఇప్పటివరకూ ఆ మార్గంలో అధికారికంగా రైలు సేవలు కొనసాగలేదు. ఈ గూడ్స్ రైలు అలిపుర్దువర్లోని దిమ్దిమ స్టేషన్ నుంచి ఉదయం 10.30 గంటలకు ప్రయాణం ప్రారంభించింది. బల్దిబరి మీదుగా బ్లంగాదేశ్లోని ఛిలహతికి చేరుకోనుంది.