తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా కొడుకు చేసింది తప్పే.. కానీ నవీన్​ హత్య ఒక్కడి వల్ల సాధ్యం కాదు' - Comments of accused father in Naveen murder case

HariharaKrishna Father Comments On Naveen Murder: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపుర్​మెట్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్.. మృతుడు నవీన్ తల్లిదండ్రులకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. తన కుమారుడు (హరిహర కృష్ణ) ఒక్కడే అంత కిరాతకంగా హత్య చేయడం సాధ్యం కాదని, ఇంకా ఈ హత్య వెనుక ఎవరో ఉన్నారని ఆరోపించారు. హత్య కేసుపై క్షుణ్ణంగా విచారణ జరిపించాలని పోలీసులను కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హరికృష్ణను తానే పోలీసులకు లొంగిపోవాలని చెప్పినట్లు వివరించారు.

Harihara Krishna Father Comments On Naveen Murder
Harihara Krishna Father Comments On Naveen Murder

By

Published : Feb 26, 2023, 1:44 PM IST

Updated : Feb 26, 2023, 4:10 PM IST

'నా కొడుకు చేసింది తప్పే.. కానీ నవీన్​ హత్య ఒక్కడి వల్ల సాధ్యం కాదు'

Harihara Krishna Father Comments On Naveen Murder: అబ్దుల్లాపూర్​మెట్​లో స్నేహితుడి చేతిలో అతికిరాతకంగా చనిపోయిన నవీన్ కుటుంబ సభ్యులకు నిందితుడైన హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్ క్షమాపణ చెప్పారు. అమ్మాయి ట్రాప్​లో పడి ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయాయనిని అన్నారు. ఒకరు చనిపోతే మరొకరు జైలు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. హరిహర కృష్ణ శివరాత్రి పండుగ రోజున వరంగల్​కు వచ్చాడని ఆరోజు హరిహర కృష్ణకి ఎక్కవ ఫోన్లు వచ్చాయని తండ్రి ప్రభాకర్ తెలిపారు.

ఏదో అలజడిగా ఉన్న తీరు గుర్తించి.. ఏం జరిగిందని కొడుకుని అడిగితే, ఏమీ లేదంటూ వరంగల్ నుంచి హైదరాబాద్​కు వెళ్లిపోయాడని ప్రభాకర్ చెప్పారు. ఆ తరువాత రెండు రోజుల పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. అప్పటికే నవీన్ కనబడట్లేదని మిస్సింగ్ కేసు నమోదు అయిందన్నారు. తమ అబ్బాయి కూడా కనపడకపోవడంతో తాము కూడా పోలీసులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. హరిహర కృష్ణ మళ్లీ 23వ తారీఖు వరంగల్ వచ్చాడని వెల్లడించారు.

Harihara Krishna Father Comments: 'ఆరోజు ఏం జరిగిందని నిలదీస్తే.. నవీన్​కి హరిహర కృష్ణ మధ్య గొడవ జరిగినట్టు చెప్పాడు. ఈ గొడవలో నవీన్ చనిపోయాడని చెప్పడంతో పోలీసులకు లొంగిపోవాలని చెప్పాను. పోలీసుల దగ్గరికి తీసుకెళ్దామంటే రేపు హైదరాబాదులోనే పోలీసులకు లొంగిపోతానని చెప్పి వెళ్లిపోయాడు. శనివారం రోజున హైదరాబాద్​లో పోలీసుల దగ్గర లొంగిపోయాడని తెలిసింది.' అని హరిహర కృష్ణ తండ్రి తెలిపారు.

తప్పు చేసింది ఎవరైనా.. తప్పు తప్పే అని హరికృష్ణ తండ్రి ప్రభాకర్ అన్నారు. తన కొడుకు ఒక్కడే అంత కిరాతకంగా హత్య చేయడం సాధ్యం కాదని, ఇంకా ఈ హత్య వెనుక ఎవరో ఉన్నారని ఆరోపించారు. హత్య కేసుపై పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపించాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నవీన్ కుటుంబ సభ్యులను క్షమించమని వేడుకుంటున్నామని ప్రభాకర్ అన్నారు. హరిహర కృష్ణ, నవీన్ ఇద్దరు ఇంటర్ నుంచి మంచి స్నేహితులేనని, ఒక అమ్మాయి మూలంగా ఇద్దరు జీవితాలు పాడైపోయాయని వాపోయారు. అమ్మాయిల ట్రాప్​లో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువకులకు సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 26, 2023, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details