తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కమెడియన్ కాలు విరిచిన బీజేపీ నాయకులు.. దాడిలో నటుడి భార్య హస్తం! - taminadu bjp sg suryah latest news

Comedian Venkatesan Attack : తమిళనాడుకు చెందిన వెంకటేశన్​ అనే కమెడియన్​పై బీజేపీ నాయకులు దాడి చేసి కాళ్లు విరగొట్టారు. ఈ ఘటనలో అతడి భార్య హస్తం కూడా ఉండటం అశ్చర్యాన్ని కలిగించే విషయం.

Comedian Venkatesan Attack
కమెడియన్​ వెంకటేశన్​పై దాడి

By

Published : Jun 18, 2023, 5:14 PM IST

Comedian Venkatesan Attack : కోలీవుడ్ కమెడియన్ వెంకటేశన్​పై తమిళనాడు బీజేపీ నాయకులు దాడి చేసి.. అతడి కాలు విరిచారు. అయితే మొత్తం దాడి ప్రణాళికలో బాధితుడి భార్య కీలక పాత్ర పోషించింది. దీంతో వెంకటేశన్ భార్యతో సహ మరో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. తమిళనాడు మదురైలో జరిగిందీ ఘటన.

ఇదీ జరిగింది..
వెంకటేశన్ తన భార్య భానుమతి, కుమార్తెతో కలిసి మదురైలోని థాబల్​ తంతినగర్ 3వ వీధిలో ఉంటున్నారు. కాగా వీరిది ప్రేమ వివాహం. వెంకటేశన్, భానుమతి ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.​ వెంకటేశన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటారు. తమిళ్​లో 'కరుప్పస్వామి కుతగైతరార్'​ అనే తమిళ​ సినిమాల్ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బుల్లితెర ప్రోగ్రామ్స్​ల్లోనూ వెంకటేశన్ ప్రేక్షకులను అలరించేవారు.

అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పరిచయం అయిన అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని భానుమతి ఆరోపించింది. దీని కారణంగా వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో వెంకటేశన్​కు తన భార్య భానుమతితో విభేదాలు తలెత్తాయి. దీంతో కోపం పెంచుకున్న భానుమతి.. తన భర్తపై దాడి చేయించి కాళ్లు విరిచేసి ఇంట్లోనే ఉంచుకోవాలని ఓ ప్లాన్ వేసింది. ముందుగా వెంకటేశన్ కారు డ్రైవర్ ద్వారా రాజ్​ కుమార్ అనే వ్యక్తిని కలిసింది.​ తన భర్త కాళ్లు విరిచేందుకు అతడికి లక్ష రూపాయలతో బేరం కుదుర్చుకుంది. కానీ తన భర్తపై ఎలా దాడి చేయించాలో అర్థంకాక.. తన బంధువు, రాష్ట్ర బీజేపీ ఎస్సీ కమిటీ మెంబర్​ అయిన వైరముత్తునుతో తన సమస్యను చెప్పుకుంది.

భానుమతి సమస్య విన్న వైరముత్తు.. ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి రాజకీయ రంగు పులమాలని అనుకున్నాడు. అందుకోసం ఇద్దరు బీజేపీ నాయకులను కలిసిన వైరముత్తు.. వెంకటేశన్ అనే కమెడియన్ డీఎంకే మద్దతుదారుడని, అతడు సోషల్ మీడియాలో ప్రధాని మోదీ, అమిత్​ షా, అన్నామలైపై అసభ్యకరంగా కామెంట్లు పెడుతుంటాడని వారితో చెప్పాడు. అంతేకాకుండా వెంకటేశన్ తన కాళ్లు విరగ్గొడతానంటూ బెదిరించాడని వారితో చెప్పి రెచ్చగొట్టాడు. వెంకటేశన్​పై దాడి చేయాలని వారిని ఉసిగొల్పాడు.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వెంకటేశన్ కారు థబల్ తంతికి చేరుకోగానే.. వైరముత్తు అతడి ముఠాతో కలిసి డ్రైవర్​ను కత్తితో బెదిరించి వెంకటేశన్​ను కిడ్నాప్ చేశారు. అనంతరం అతడ్ని నారాయణపురం వద్దకు తీసుకెళ్లి.. పార్టీనే తిడతావా అంటూ దాడి చేసి రెండు కాళ్లు విరిచారు. తీవ్ర గాయాలతో వెంకటేశన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వెంకటేశన్ డ్రైవర్ మోహన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. వెంకటేశన్ భార్య భానుమతి, డ్రైవర్ మోహన్ సహాయంతో తన భర్తపై దాడి చేయించినట్లు విచారణలో తేలింది. వీరిద్దరే కాకుండా బీజేపీ నాయకుడు వైరముత్తు.. భానుమతి సమస్య కోసం వారి పార్టీ నాయకులను వాడుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేసి మధురై సెంట్రల్ జైలుకు తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details