Colnel prithipal singh gill: గగనతలంలో శత్రువులను యుద్ధ విమానాలతో ఎదుర్కొన్నారాయన. సముద్రాలను ఆక్రమించేందుకు వచ్చినవారిపై యుద్ధనౌకలతో పోరాడారు. సరిహద్దులు దాటేందుకు కుట్రలు పన్నిన ప్రత్యర్థులను తుపాకీలతో మట్టికరిపించారు. ఆయనే.. మాజీ కర్నల్ ప్రితిపాల్ సింగ్ గిల్.
Pritipal singh gill 3 defence wings:భారత వైమానిక దళం, నౌకా దళం, సైన్యం(ఆర్మీ).. ఇలా మూడు విభాగాల్లో దేశానికి సేవలందించిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందిన ప్రితిపాల్ సింగ్ గిల్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. హరియణా చండీగఢ్‌లోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. మరో ఐదు రోజుల్లో(డిసెంబరు 11న) తన 101వ పుట్టినరోజును ప్రితిపాల్ సింగ్ జరుపుకోనుండగా.. ఈ అనూహ్య ఘటన జరగడం గమనార్హం.
త్రివిధ దళాల్లో..