college woman hacked to death: ఉత్తర్ప్రదేశ్ బాగ్పత్లో ఓ ప్రేమోన్మాది ఘూతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో 20 ఏళ్ల యువతికి గోంతుకోసి హత్య చేశాడు. ఆమె మార్కెట్కు వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా అదను చూసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనలో నిందితుడి పేరు రింకు కాగా.. మృతిచెందిన యువతి పేరు దీప. డిగ్రీ చదువుతోంది.
ఈ యువతి పట్ల 8 ఏళ్లుగా తాను ఆకర్షితుడిని అయ్యానని పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన అనంతరం రింకు తెలిపాడు. హత్యకు ఉపయోగించిన పదునైన కత్తిని కూడా పోలీసులకు సమర్పించాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.