తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నడిరోడ్డుపై 'లిప్​ లాక్​ ఛాలెంజ్​'.. ప్రముఖ కాలేజీ విద్యార్థుల రచ్చ! - కర్ణాటక లిప్​లాక్ న్యూస్

సోషల్ మీడియా ఛాలెంజ్​ల పేరిట బహిరంగ ప్రదేశాల్లో నానా రభస చేశారు ఓ ప్రముఖ కళాశాల విద్యార్థులు. యువతీయువకులు నడిరోడ్డుపై పోటీపడి ముద్దులు పెట్టుకోగా.. మిగిలిన వారు చుట్టూ చేరి కేరింతలు కొడుతూ, వారిని 'ఎంకరేజ్' చేశారు. చివరకు పోలీసులు ఏం చేశారంటే..

liplock challenge in karnataka
liplock challenge in karnataka

By

Published : Jul 21, 2022, 3:57 PM IST

'లిప్ లాక్​ ఛాలెంజ్' పేరిట ఓ ప్రముఖ కళాశాల విద్యార్థులు నడిరోడ్డుపై చేసిన రభస.. కర్ణాటక మంగళూరులో చర్చనీయాంశమైంది. యువతీయువకులు పోటీ పడి ముద్దులు పెట్టుకుంటున్న వీడియో వైరల్​ కాగా.. పోలీసులు రంగంలోకి దిగారు. ఒక విద్యార్థిని అరెస్టు చేశారు.

ముద్దుల సవాళ్లు: వీడియోలో కనిపించిన వారంతా మంగళూరులోని ఓ ప్రముఖ కళాశాల విద్యార్థులు. యూనిఫాం ధరించిన వారంతా నగరంలోని ఓ రహదారిపై గుమిగూడారు. ఓ ఇంటి ముందు చేరి నానా రభస చేశారు. అబ్బాయి, అమ్మాయి పోటీపడి ముద్దులు పెట్టుకోగా.. మిగిలిన విద్యార్థులు చుట్టూ చేరి కేరింతలు కొట్టారు. "దమ్ముంటే మీరు కూడా ఇలా చేయండి" అంటూ తోటి విద్యార్థులకు సవాల్ విసిరారు.

లిప్​ లాక్​ ఛాలెంజ్​ పేరిట చేసిన ఈ రచ్చతో ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అక్కడున్న ఓ ఇంట్లోని వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతి తక్కువ సమయంలోనే వైరల్ అయిన ఈ దృశ్యాలు.. దక్షిణ కన్నడ జిల్లావ్యాప్తంగా దుమారం రేపాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. వీడియోలో ముద్దులు పెడుతూ కనిపించిన ఓ విద్యార్థిని అరెస్టు చేశారు. ఆ సమయంలో అక్కడున్న వారు డ్రగ్స్ సేవించి ఉన్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:కడుపునొప్పితో బాధపడుతున్న ఆ రాష్ట్ర సీఎం.. అపోలో ఆస్పత్రిలో చేరిక

'రాష్ట్రపతి ఎన్నిక' ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ పూర్తి.. ముర్ముకు భారీ ఆధిక్యం!

ABOUT THE AUTHOR

...view details