College Student Kidnapped and Raped :కాలేజ్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు ఇద్దరు వ్యక్తులు. మొబైల్‌తో ఆమె నగ్న ఫొటోలు తీసి.. ఘటన గురించి ఎవరితోనూ చెప్పొద్దని బెదిరించారు. తాము చెప్పినట్లు చేయకపోతే ఆ ఫొటోలు వైరల్ చేస్తామని హెచ్చరించారు. అనంతరం బాధితురాలి వద్ద ఉన్న డబ్బును తీసుకుని పారిపోయారు. బంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన జరిగింది.
బాధితురాలు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం..మందిర్ బజార్‌కు చెందిన యువతి గురువారం ఉదయం 10 గంటలకు బ్యాంక్‌కు వెళ్లింది. అనంతరం అక్కడ తన స్నేహితుడ్ని కలిసింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ఆమెను కిడ్నాప్ చేశారు. వారిలో ఓ వ్యక్తి యువతిపై అత్యాచారానికిఒడిగట్టాడు. సికందర్‌పుర్ జంక్షన్లో ఎవరూ లేని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. వారిని మరోసారి కలవాలని.. లేకపోతే ఫొటోలు వైరల్ చేస్తామని బెదిరించారు.
ఘటనపై గురువారం రాత్రి మందిర్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. అయితే దీనిపై పోలీసులు అలసత్వం వహిస్తున్నారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. రాజకీయ దురుద్దేశంతోనే తన భర్తపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది ఓ నిందితుడి భార్య.