కోడిగుడ్డు పెంకులను కాన్వాస్‌లా మార్చాడు తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఓ 11 ఏళ్ల కుర్రాడు. గుడ్డు పెంకులపై అద్భుతమైన కార్టూన్ చిత్రాలను గీసి అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాడు.
"లాక్డౌన్ సమయంలో ఇంటిదగ్గరే ఉండటం చాలా బోర్ కొట్టేది. ఈ క్రమంలో నాకు ఓ ఆలోచన వచ్చింది. కోడిగుడ్డు తిని వాటి పెంకులను పారేయకుండా కొత్తగా ఏమైనా చేయాలి అనుకున్నాను. ఆపై పెంకులపై బొమ్మలు గీస్తే బాగుంటుందనిపించింది. ఇప్పటివరకు 100కుపైగా చిత్రాలను గీశాను."