Coconut breaking with hand: ఒంటి చేత్తో 150 కొబ్బరికాయలు పగలగొట్టి రికార్డు సృష్టించాడు హరియాణాలోని రోహ్తక్కు చెందిన ఓ వ్యక్తి. కేవలం ఒక్క నిమిషంలోనే ఈ ఫీట్ సాధించి గిన్నిసి రికార్డుపై కన్నేశాడు. గతంలో ఈ రికార్డు కేరళకు చెందిన ఓ యువకుడి పేరున ఉండేది. అతడు నిమిషంలో 122 కొబ్బరికాయలు పగలగొట్టాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌కు చెందిన ధర్మేంద్ర చాలా కాలంగా రోహ్తక్లో నివసిస్తున్నాడు. అక్కడి కూరగాయల మార్కెట్లో కూలీ పనులు చేస్తున్నాడు. అయితే.. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో కొబ్బరికాయలు పగలగొట్టటం చూసి తానూ అలానే చేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకు తగినట్లుగా సాధన చేశాడు. గతంలో కేరళకు చెందిన ఓ యువకుడు నిమిషంలో 122 కొబ్బరికాయలు, జర్మనీకి చెందిన ముహమ్మద్ అనే వ్యక్తి 148 పగలగొట్టినట్లు తెలుసుకున్నాడు ధర్మేంద్ర. వారి కన్నా ఎక్కువ పగలగొట్టి రికార్డు సృష్టించాలని నిర్ణయించుకున్నాడు.