గుజరాత్ తీరం వద్ద అరేబియన్ సముద్రంలో ఓ జాలర్ల పడవకు నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఏడుగురు జాలర్లను ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం రక్షించింది.
గుజరాత్ తీరానికి సుమారు 50మైళ్ల దూరంలో జాలర్లు చేపల వేటకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. అంతర్జాతీయ జలాల సరిహద్దుల్లో ఉండగా.. ఇంజిన్లో నుంచి ఇంధనం లీక్ అవడం వల్ల తొలుత పడవ మునగడం మొదలుపెట్టింది. తర్వాత పడవకు మంటలు అంటుకున్నాయి.