తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నల్ల బంగారం గనుల్లో 'కేజీయఫ్'​ తరహా కుంభకోణం.. వీడియో వైరల్! - kgf part3 movies

కన్నడ సూపర్‌స్టార్‌ యశ్​ హీరోగా తెరకెక్కిన 'కేజీయఫ్​2' చిత్రం.. అన్ని భాషల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక, ఈ మూవీ కథ అంతా కోలార్ గోల్డ్ మైన్స్​ చుట్టూ తిరుగుతుంది. అయితే ఛత్తీస్​గఢ్​​లోని కోర్బా గనుల్లో బంగారం లేదు కానీ నల్ల బంగారం(బొగ్గు) ఉంది. ఇప్పుడు ఈ గనులకు సంబంధించి ఓ వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వేలాది మంది ప్రజలు బొగ్గును తరలిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఆ వీడియో నిజమేనా? కాదో? తెలియాల్సి ఉంది.

Coal Theft Viral Video
Coal Theft Viral Video

By

Published : May 20, 2022, 5:26 PM IST

సోషల్​మీడియోలో వైరల్​ అవుతున్న వీడియో

Coal Theft Viral Video: ఛత్తీస్​గఢ్​లోని కోర్బా గనుల్లో బొగ్గు దొంగతనానికి సంబంధించిన ఓ వీడియో సోషల్​ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కేజీయఫ్​ పార్ట్ 3 అనే హాష్​ ట్యాగ్​ జోడించి నెటిజన్లు తెగ షేర్​ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడిది అనేది స్పష్టంగా తెలియరాలేదు. కానీ నెటిజన్లు మాత్రం కోర్బా బొగ్గు గనిలోనిదే అని షేర్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు.

విచారణకు ఆదేశించిన ఐజీ.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బిలాస్‌పుర్ డివిజన్​కు చెందిన ఐజీ రతన్‌లాల్ డాంగి.. విచారణకు ఆదేశించారు. దర్యాప్తు బాధ్యత బిలాస్‌పుర్‌లోని యాంటీ క్రైమ్ &సైబర్ యూనిట్‌కు అప్పగించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రాయగడ, కోర్బా ఎస్పీలను కూడా ఆదేశించారు. అయితే ఇదే సమయంలో కొందరు అధికారులను సైతం బదిలీ చేయడం గమనార్హం.

ఈ అంశాలపై విచారణకు ఆదేశించిన బిలాస్​పుర్​ ఐజీ..

  • వైరల్ అవుతున్న ఈ వీడియో ఏ గని, ఏ జిల్లాకు చెందినది?
  • ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు గనిలోకి ప్రవేశిస్తుంటే.. అక్కడ మోహరించిన సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎందుకు ఆపలేకపోయింది?
  • SECL(సౌత్​ ఈస్టర్న్​ కోల్​ ఫీల్డ్స్​) గనుల భద్రతలో కేంద్ర భద్రతా బలగాలు, జిల్లా పోలీసుల మధ్య సమన్వయం ఎలా ఉంది?
  • గతంలో బొగ్గు చోరీపై అధికారులు పోలీస్‌స్టేషన్లకు ఫిర్యాదు చేయగా, దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
  • చర్యలు తీసుకోకపోతే కారణాలేంటి?
  • దొంగిలించిన ఈ బొగ్గును కొనుగోలు చేసిన వారెవరు?
  • దొంగిలించిన బొగ్గును ఎవరికి పంపుతున్నారు?
  • ఈ బొగ్గు దొంగతనం కేసులో ఎవరైనా అధికారి/ఉద్యోగి ప్రమేయం ఉందా?

వీడియోలో ఏముంది?...వైరల్ అవుతున్న ఆ కోల్ మైన్ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఇక, ఆ వీడియోకు కేజీయఫ్​ చిత్రానికి సంబంధించిన బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​ను యాడ్​ చేశారు. దీంతో మరింత వైరలైంది. గనుల నుంచి బొగ్గును తీసుకువెళుతున్న వందల వేల మంది ప్రజలను మనం చూడొచ్చు. ఇంతకీ ఇది ఎవరి వీడియో? ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు గనిలోకి ఎలా ప్రవేశించారనేది పెద్ద ప్రశ్న?

ఈ వీడియోపై ట్వీట్​ చేసిన భాజపా నేత.. వైరల్ అవుతున్న ఆ వీడియోను తాజాగా ఆ రాష్ట్ర​ భాజపా నాయకుడు ఓపీ చౌదరి ట్వీట్ చేశారు. "ఈ వీడియో కోర్బా గనులదే. ఆసియాలోనే అతిపెద్ద బొగ్గు గని అయిన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో ఉన్న గెవ్రా మైన్స్‌లోనివే ఈ దృశ్యాలు. మాఫియా రాజ్‌ల ఓపెన్ గేమ్ ఇది. వేలాది మంది కార్మికులు, వందలాది వాహనాల ద్వారా బొగ్గును బహిరంగంగా దొంగిలిస్తున్నారు" అని రాసుకొచ్చారు.

దేశంలో 20 శాతం బొగ్గు అక్కడినుంచే..కోల్ ఇండియా లిమిటెడ్​లో కోర్బా గనులు అతిపెద్దవి. దేశానికి దాదాపు 20 శాతం బొగ్గు ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. సంవత్సరానికి SECL ఉత్పత్తి లక్ష్యం 120 మిలియన్ టన్నులు. అయితే ఈ గనుల్లో బొగ్గు దొంగతనాలు తరచూ జరుగుతూ ఉంటాయి. ఇక, ఈ వీడియోపై దర్యాప్తు పూర్తయ్యాక అసలు నిజాలు బయపడనున్నాయి.

ఇవీ చదవండి:భార్యతో గొడవ.. సిలిండర్​ పేల్చుకుని భర్త మృతి.. ఇద్దరు పోలీసులకు గాయాలు

గాల్లో ఉండగా ఇంజిన్ బంద్.. 'టాటా' ఫ్లైట్​కు తప్పిన పెనుముప్పు

ABOUT THE AUTHOR

...view details