Coal Mine Collapse: బొగ్గు గనుల పైకప్పు కూలిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గనుల్లో చిక్కుకున్నారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో జరిగింది. మూసివేసిన ఈ గనుల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు అధికారులు. ఈస్ట్రెన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (ఈసీఎల్)కు చెందిన గని నుంచి బయటపడ్డ మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి ఉన్నట్లు తెలిపారు. కాపాసరలోని ఈసీఎల్, ఛాచ్ విక్టోరియా ఆఫ్ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)కు చెందిన గనుల్లో కూడా మృతులు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
మొదటగా సోమవారం సాయంత్రం 5గంటలకు కాప్సరా ఔట్సోర్సింగ్ ప్రాజెక్ట్ వద్ద గని కూలిందని, ఆ తర్వాత కొన్ని గంటలకు బీసీసీఎల్ వద్ద గని. మంగళవారం ఉదయం గోపీనాథ్‌పుర్ వద్ద గనుల్లో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. భారీ యంత్రాలతో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు.