తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Coal India Limited Jobs 2023 : ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. కోల్​ ఇండియాలో 560 పోస్టులు.. నెలకు రూ.లక్షన్నర జీతం!

Coal India Limited Jobs 2023 : ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్​న్యూస్​. ప్రభుత్వరంగ సంస్థ కోల్​ ఇండియా లిమిటెడ్​లో మొత్తం 560 మేనేజ్​మెంట్​ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్​ విడుదలైంది. మరి ఇందుకు కావాల్సిన విద్యార్హతలు ఏంటి? జీతభత్యాలు ఎలా ఉంటాయి? దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు తదితర వివరాలు మీకోసం.

Coal India Limited Recruitment 2023
Coal India Limited Jobs 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 12:00 PM IST

Coal India Limited Jobs 2023 : ఇంజినీరింగ్​ పూర్తి చేసి GATE-2023లో మంచి స్కోర్​ సాధించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కలలు కంటున్నవారికి శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్​లో మొత్తం 560 మేనేజ్​మెంట్​ ట్రైనీ E-2 గ్రేడ్​ పోస్టుల నియామక ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్​ విడుదలైంది. ఇప్పటికే సెప్టెంబర్​ 13(బుధవారం) నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కాగా, అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్​ 12 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు!
560 పోస్టులు.

ఈ పోస్టులు!
మేనేజ్​మెంట్​ ట్రైనీ(E-2 గ్రేడ్​) పోస్టులు.

ఈ విభాగాల్లో..!

  • మైనింగ్​- 351 పోస్టులు
  • సివిల్​- 172 ఖాళీలు
  • జియాలజీ- 37 పోస్టులు

ఏజ్​ లిమిట్​!
Coal India Limited Jobs Age Limit :2023 ఆగస్టు 31 నాటికి అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు.

విద్యార్హతలు!

  • మైనింగ్​ డిగ్రీ / సివిల్​ ఇంజినీరింగ్​.
  • GATE-2023లో కచ్చితంగా పాసై ఉండాలి.
  • అభ్యర్థులు ఎం.ఎస్​.సీ / ఎం.టెక్​లో జియాలజీ, అప్లైడ్​ జియాలజీ, జియోఫిజిక్స్​, అప్లైడ్​ జియోఫిజిక్స్​ ఉత్తీర్ణులై ఉండాలి.

జీతభత్యాలు!
Coal India Limited Jobs Salary :ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు వేతనం పొందుతారు.

దరఖాస్తు విధానం!
అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం!
Coal India Limited Jobs Selection Process :డాక్యుమెంట్స్​ వెరిఫికేషన్​, మెడికల్​ టెస్టు సహా GATE-2023లో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

అప్లికేషన్​ ఫీజు!

  • జనరల్​, ఓబీసీ, ఈడబ్యూఎస్​ అభ్యర్థులకు- రూ.1,180/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు. పూర్తిగా ఉచితం.

ముఖ్యమైన తేదీలు!

Coal India Limited Jobs Important Dates :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్ 13
  • దరఖాస్తు స్వీకరణకు చివరితేదీ : 2023 అక్టోబర్​ 12(సాయంత్రం 6 గంటల వరకు)

జాబ్​ లొకేషన్!
Coal India Limited Job Location :మేనే​మెంట్​ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బంగాల్​ రాజధాని కోల్​కతాలో ఉన్న కోల్​ ఇండియా లిమిటెడ్​ సంస్థలో పనిచేయాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్​సైట్​!
CIL Website :నోటిఫికేషన్​కి సంబంధించి సిలబస్​ సహా తదితర పూర్తి వివరాల కోసం కోల్​ ఇండియా లిమిటెడ్​ అధికారిక వెబ్​సైట్ https://www.coalindia.in ను వీక్షించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details