పలు కుంభకోణాల కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తోన్న లాలు ప్రసాద్ యాదవ్.. బిహార్ ఎన్నికల ఫలితాల ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ తన కుమారుడు తేజస్వీ పుట్టినరోజు సందర్భంగా లాలూ ఆయనతో మాట్లాడారట. ఈ సందర్భంగా బిహార్ ప్రజలు నీకు సీఎం పీఠాన్ని బహుమతిగా ఇస్తారని చెప్పినట్లు సమాచారం. లాలూ ప్రస్తుతం రాంచి రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు.
నేడు తేజస్వీ పుట్టినరోజును ఆర్జేడీ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా చేసింది. ఈ సందర్భంగా తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
"నితీశ్ కుమార్‌ను ఈ ఎన్నికల్లో బిహార్ ప్రజలు తిరస్కరించారు. నిరుద్యోగం వంటి సమస్యలను తీర్చలేకపోయిన జేడీయూ చేతకానితనం వల్లే ప్రజలు మాకు మద్దతు పలికారు. ఆయన ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయింది. ఎగ్జిట్ పోల్స్‌ను పక్కనపెడితే మాకు ప్రజలపై నమ్మకం ఉంది. వాళ్లు మాకు భారీ విజయాన్ని అందిస్తారు".