UP CM Yogi Adityanath: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్.. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు భోజన విరామ సమయం అరగంటకు మించకూడదని నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన టీమ్ 9 అధికారులతో సీఎం ఆదిత్యనాధ్ సమావేశమయ్యారు. పారదర్శకత దృష్ట్యా వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులకు డీపీఆర్ సిద్ధం చేసిన సంస్థలను టెండర్ ప్రక్రియలో పాల్గొనకుండా చూడాలని సూచించారు.
'ఉద్యోగులకు లంచ్ బ్రేక్ అరగంటే..' - యోగి ఆదిత్యనాథ్ న్యూస్
UP CM Yogi Adityanath: ప్రభుత్వ కార్యాలయాల్లో భోజన విరామ సమయం అరగంటకు మించకూడదన్నారు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. టీమ్ 9 అధికారులతో సమావేశమైన యోగి.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

UP CM Yogi Adityanath:
విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు అందజేస్తుందని యోగి చెప్పారు. బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే రూపంలో రాష్ట్రానికి కొత్త బహుమతి రాబోతుందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఏప్రిల్ 18 నుంచి 23 వరకు ప్రత్యేక ఆరోగ్య మేళాలు నిర్వహించాలన్నారు. అదే విధంగా మొత్తం 75 జిల్లాలో 75 చెరువులను పూడిక తీసి భూగర్భ జలాలను మరింత మెరుగుపరచాలని పిలుపునిచ్చారు. గోధుమ కొనుగోళ్లు సజావుగా సాగేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు.