CM Revanth Reddy Fell Sick : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న సీఎం రేవంత్(CM Revanth) ప్రస్తుతం ఇంటిపట్టునే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి చేరుకున్న వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జలుబు, దగ్గుతో కూడా ఇబ్బంది పడుతున్న రేవంత్‌కు వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన కేఏ పాల్ - ప్రపంచ శాంతి సదస్సుకు రావాలని ఆహ్వానం
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కొవిడ్(Covid) న్యూ వేరియంట్ జేఎన్1 చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా జ్వరం బారిన పడటంతో కరోనా పరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయితే ఇటీవల సీఎంతో పాటు సమావేశాలు, సమీక్షల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు కూడా కొవిడ్ నిర్ధరణ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
'కరోనా కొత్త వేరియంట్‌తో భయం లేదు- వ్యాక్సిన్ ఎక్స్ట్రా డోస్ కూడా!'