తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్‌ వల్లే ఇండియా కూటమి జోరు తగ్గింది : నీతీశ్‌ కుమార్‌ - నీతీశ్ కుమార్ లేటెస్ట్ న్యూస్

CM Nitish Kumar on INDIA Alliance : ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్‌ పార్టీ నిమగ్నమైందని, విపక్షాల కూటమిపై అంతగా దృష్టిపెట్టడం లేదని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ విమర్శించారు.

CM Nitish Kumar on INDIA Alliance
సభలో అభివాదం చేస్తున్న నేతలు

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 3:45 PM IST

CM Nitish Kumar on INDIA Alliance : జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహార తీరుపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీ నిమగ్నమైందని.. విపక్ష కూటమిపై అంతగా దృష్టిపెట్టడం లేదని ఆరోపించారు. అందువల్లే మొన్నటివరకు కనిపించిన 'ఇండియా' కూటమి దూకుడు కొనసాగించలేక పోతోందన్నారు. 'బీజేపీ హటావో దేశ్‌ బచావో' పేరుతో పట్నాలో సీపీఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశాన్ని కాపాడటం కోసమే విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని నీతీశ్‌ కుమార్​ తెలిపారు.

సభలో అభివాదం చేస్తున్న నేతలు

"విపక్షాల కూటమి ఇండియాలో పెద్దగా పురోగతి లేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనే కాంగ్రెస్‌ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ సారథ్యంలోనే ముందుకు నడిపించేందుకు అందరం అంగీకరించాం. కానీ, ఈ ఎన్నికల తర్వాతే మళ్లీ సమావేశం ఏర్పాటుకు వారు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దీని వల్ల వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధతపై ఆలస్యం అవుతోంది."

--నీతీశ్ కుమార్‌, బిహార్ ముఖ్యమంత్రి

Nitish Kumar On BJP : బీజేపీపై విరుచుకుపడిన నీతీశ్ కుమార్.. దేశ చరిత్రను మార్చేందుకు వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బిహార్​లో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం మత ఘర్షణలు జరగకుండా పాలిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని 95 శాతం మంది ప్రజలను ఇప్పటికే ఏకం చేశానని చెప్పారు. ఇదే వేదికపై ఉన్న జేడీయూ నేతలు కూడా కాంగ్రెస్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Nitish Kumar On CPI :మరోవైపు సీసీఐ జనరల్‌ సెక్రటరీ డీ రాజాతో కలిసి వేదిక పంచుకున్న నీతీశ్‌ కుమార్‌.. సుమారు నాలుగు దశాబ్దాలుగా కమ్యూనిస్టు పార్టీలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మొదటిసారిగా తాను ఎన్నికల బరిలో దిగిన సమయంలో సీపీఎం, సీపీఐలు తన విజయానికి కలిసి పని చేశాయన్నారు. బిహార్‌లో కమ్యూనిస్టుల ప్రగతిశీల దృక్పథాన్ని ఎంతో కీర్తించేవారమని.. అప్పట్లో వారి ర్యాలీల్లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనేవారని నీతీశ్‌ కుమార్‌ గుర్తుచేశారు.

India Alliance in Madhya Pradesh : ఇండియా కూటమి ఉన్నట్టా లేనట్టా? దిల్లీలో దోస్తీ.. అసెంబ్లీ ఎన్నికల్లో కుస్తీ!

Akhilesh Yadav On India Alliance : 'ఇండియా' కూటమిలో లుకలుకలు.. అలా చేస్తే బయటికి పోతామని అఖిలేశ్​ వార్నింగ్​

ABOUT THE AUTHOR

...view details