తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్నారి సాయానికి ఫిదా- సీఎం 'సైకిల్'​ గిఫ్ట్​ - బాలుడికి సైకిల్​ను బహుమతిగా ఇచ్చిన స్టాలిన్

తమిళనాడు మదురైకు చెందిన ఏడేళ్ల బాలుడు.. తన సేవాగుణంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ మనసు గెలుచుకున్నాడు. రెండేళ్లుగా సైకిల్ కొనేందుకు దాచుకున్న డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చాడు. చిన్నారి మంచితనానికి ఫిదా అయిన సీఎం.. ఆ బాలుడికి సైకిల్ బహుమతిగా​ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

cycle gifted to 7 year old boy for his help
సైకిల్​తో చిన్నారి

By

Published : May 11, 2021, 8:20 PM IST

తమిళనాడు మదురై అరప్పాళయంలో ఓ ఏడేళ్ల బాలుడి మంచి మనసుకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​ ఫిదా అయ్యారు. రెండో తరగతి చదువుతున్న హరీష్​ వర్మ(7).. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా తన రెండేళ్ల కలను త్యాగం చేశాడు. సైకిల్ కొనేందుకు 2 సంవత్సరాలుగా దాచుకున్న రూ. 1000ను.. సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చాడు.

చిన్నారి విరాళం
స్టాలిన్​ బహుమతిగా ఇచ్చిన సైకిల్​పై హరీష్

నెరవేరిన కల..

చిన్నారి సేవాగుణానికి కరిగిపోయిన సీఎం స్టాలిన్.. బాలుడి రెండేళ్ల కలను తీర్చారు. హరీష్​కు శుభాకాంక్షలు చెబుతూ.. సైకిల్ బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత బాలుడికి ఫోన్​చేసి ప్రశంసించారు. ఉత్తర మదురై డీఎంకే పార్టీ సెక్రటరీ కే. తళపతి.. సైకిల్​ను బాలుడికి అందజేశారు.

ఇదీ చదవండి :కొవిడ్​ కేర్ సెంటర్​గా గోశాల

ABOUT THE AUTHOR

...view details