తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాంబు దాడి : బంగాల్​ మంత్రికి మమత పరామర్శ

బంగాల్​లో జరిగిన బాంబు దాడిలో గాయపడ్డ రాష్ట్ర మంత్రి జాకిర్​ హుస్సేన్​ ఆరోగ్య నిలకడగా ఉందని.. చెయ్యి, కాలుకు గాయాలయ్యాయని ముర్షిదాబాద్​ వైద్య కళాశాల వెల్లడించింది. మరోవైపు హుస్సేన్​ను మమతా బెనర్జీ పరామర్శించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

mamata banerjee, bomb attack
బంగాల్​ మంత్రికి మమత పరామర్శ

By

Published : Feb 18, 2021, 12:25 PM IST

బాంబు దాడిలో గాయపడ్డ బంగాల్​ మంత్రి జాకిర్​ హుస్సేన్​ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరామర్శించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

బాంబు దాడి : బంగాల్​ మంత్రికి మమత పరామర్శ

బుధవారం రాత్రి.. బంగాల్​ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జాకీర్​ హుస్సేన్​పై బాంబు దాడి జరిగింది. ముర్షిదాబాద్​ జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కోల్​కతా వెళ్లేందుకు నిమ్​టిటా స్టేషన్​ వైపు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆయనపై దుండగులు బాంబులు విసిరారు. అనంతరం ఆయన్ని ముర్షిదాబాద్​ వైద్య కళాశాలకు చికిత్స కోసం తరలించారు.

హుస్సేన్​ పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు గురువారం ఉదయం వెల్లడించాయి. ఆయన చేయ్యి, కాలుకు గాయాలైనట్టు వెల్లడించారు.

సీఐడీ విచారణ..

జాకీర్​ హుస్సేన్​పై బాంబు దాడి ఘటనకు సంబంధించిన కేసుపై సీఐడీ విచారణ చేపట్టనుంది. నిందితులను పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించింది.

ఇదీ చదవండి :ఎన్నికల వేళ బంగాల్​లో అమిత్ షా పర్యటన

ABOUT THE AUTHOR

...view details