తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉచిత విద్య, వైద్యం తప్పా?'.. మోదీ వ్యాఖ్యలపై కేజ్రీ ఫైర్ - కేజ్రీవాల్ మోదీ ఫైర్

Kejriwal on free education: ఉచిత పథకాలు దేశాభివృద్ధికి ప్రమాదకరమంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడం తప్పు కాదని... కార్పొరేట్ సంస్థలకు రూ.వేల కోట్లు మాఫీ చేయడం ఉచిత పథకాల కిందకు వస్తుందని ఎద్దేవా చేశారు.

Kejriwal counters Modi freebies
Kejriwal counters Modi freebies

By

Published : Jul 16, 2022, 7:09 PM IST

Kejriwal counters Modi freebies: ఉచిత పథకాల గురించి చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చురకలు అంటించారు. ప్రధాని పేరు ప్రస్తావించకుండానే సునిశిత విమర్శలు చేశారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత విద్యుత్‌ లాంటి పథకాలు ఉచితాలు కావని... వ్యాపార వేత్తలకు రూ.వేల కోట్లు మాఫీ చేయడం లాంటివి ఉచిత పథకాల కిందికి వస్తాయని వ్యాఖ్యానించారు. దిల్లీలోని 18 లక్షల విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం ఉచిత పథకం కాదని... 2 కోట్ల మంది ప్రజలకు వైద్యం అందించడం ఉచితం కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

"పేద, మధ్యతరగతి పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైన, ఉచిత విద్యను అందిస్తున్నాం. ఇవి ఉచిత పథకాలు కాదు, దేశ పునాదికి మేము ఒక్కొక్క ఇటుకను పేర్చుతున్నాం. ఇవాళ దిల్లీ ఆస్పత్రులను మేము అద్భుతంగా తీర్చిదిద్దాం. దిల్లీలో అద్భుతమైన మెుహల్లా క్లినిక్‌లపై ప్రపంచంలో చర్చ జరుగుతోంది."
-కేజ్రీవాల్, దిల్లీ సీఎం

"ఇప్పుడు ఉచిత పథకాలు అంటే ఏంటో నేను చెబుతాను. ఈ దేశంలో ఉచిత పథకాలు ఎవరు ఇస్తున్నారో నేను వివరిస్తా. ఒక ప్రముఖ సంస్థ ఉంది. ఆ సంస్థ ఒక బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఖర్చు చేసింది. తర్వాత బ్యాంకు దివాలా తీసింది. ఆ సంస్థ దేశంలోని ఒక రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చింది. ఆ సంస్థపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అది ఉచిత పథకం అంటే. మీ స్నేహితులకు వేలాది కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేస్తున్నారు కదా అవీ ఉచిత పథకాలు అంటే. విదేశీ యాత్రలకు వెళ్లినపుడు ఆ ప్రభుత్వాల నుంచి మీ మిత్రులకు వేలకోట్ల కాంట్రాక్టులు ఇప్పించడం ఉచిత పథకం" అని కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details