తెలంగాణ

telangana

ETV Bharat / bharat

CM KCR: 'కొత్త సచివాలయం తెలంగాణ పునర్నిర్మాణానికి నిలువెత్తు సాక్ష్యం' - నూతన సచివాలయం ప్రారంభం

CM KCR Speech at Secretariat Inauguration Ceremony: హైదరాబాద్‌లో శిఖరాయమానంగా నిలిచిన నూతన సచివాలయమే తెలంగాణ పునర్‌నిర్మాణానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరెంట్‌ కోతల నుంచి 24గంటల విద్యుత్‌ వరకు, నీటి గోస నుంచి నడి వేసవిలో మత్తడి దూకుతున్న చెరువుల వరకు.. బీళ్లు వారిన భూముల నుంచి పసిడి పంటల తెలంగాణ వరకు సాగిన ప్రయాణమే... రాష్ట్ర పునర్‌నిర్మాణానికి భాష్యమని తెలిపారు. సెక్రటేరియట్‌ కాంతులీనుతున్న తరహాలోనే తెలంగాణ వెలుగొందుతోందని కేసీఆర్ పేర్కొన్నారు.

cm kcr
cm kcr

By

Published : Apr 30, 2023, 3:21 PM IST

Updated : Apr 30, 2023, 6:34 PM IST

CM KCR Speech at Secretariat Inauguration Ceremony: రాజధాని నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఠీవీగా రాజసం ప్రదర్శిస్తున్న సమీకృత సచివాలయ భవనం ప్రారంభమైంది. అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర పాలనా సౌధాన్ని ప్రారంభించారు. అనంతరం సచివాలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.

రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడమే మా విధానం: తెలంగాణ పునర్నిర్మాణంపై కొందరు అవాకులు చెవాకులు పేలారని... తెలంగాణ మొత్తం కూలగొట్టి కడతారా అని హేళన చేశారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. సమ్మిళిత అభివృద్ధితో ప్రగతిఫతంలో సాగుతున్న తెలంగాణయే పునర్‌నిర్మాణానికి నిదర్శనమని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయతో చెరువుల రూపురేఖలు మార్చాంమని... మత్తడి తొక్కుతున్న చెరువులే రాష్ట్ర పునర్నిర్మాణానికి తార్కాణమని తెలిపారు. విమర్శలు పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడమే మా విధానమని స్పష్టం చేశారు. వేసవిలో దేశవ్యాప్తంగా 96 లక్షల ఎకరాలు సాగైతే... ఇందులో 54 లక్షల ఎకరాలు మనవద్దే ఉన్నాయని తెలిపారు. తెలంగాణ పల్లెలు ఎన్నో అవార్డులు సాధిస్తున్నాయన్నారు.

సచివాలయ ప్రారంభం నా చేతుల మీదుగా జరగడం గొప్ప అదృష్టం: కేసీఆర్‌

'కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సచివాలయ ప్రారంభం నా చేతుల మీదుగా ప్రారంభించడం గొప్ప అదృష్టం. సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉంది. సచివాలయం తరహాలోనే తెలంగాణ పల్లెలూ వెలుగుతున్నాయి. అంబేడ్కర్ చూపిన బాటలోనే ముందుకు సాగుతున్నాం. గాంధీ మార్గంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే రాష్ట్రం వచ్చింది. సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టుకోవడం గర్వకారణం. రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అందరికీ జోహార్లు.'-సీఎం కేసీఆర్

ఐటీలో బెంగళూరును దాటి తెలంగాణ దూసుకుపోతోంది:కోల్పోయిన అడవులు తిరిగి తెచ్చుకోవడం రాష్ట్ర పునర్నిర్మాణమే అని సీఎం కేసీఆర్ అన్నారు. వలసలు వెళ్లిన పాలమూరు బిడ్డలు వెనక్కి రావడం పునర్నిర్మాణమే అన్న కేసీఆర్.. ఆచరణాత్మక విధానాలతో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిచోట్ల నిర్మాణాలు కూలగొట్టి కట్టామన్నారు. సమ్మిళిత అభివృద్ధితో తెలంగాణ ముందుకెళ్తోందన్నారు. ఐటీలో బెంగళూరును దాటి తెలంగాణ దూసుకుపోతోందన్న ముఖ్యమంత్రి... పదేళ్లలో చిన్న అల్లర్లు కూడా లేకుండా శాంతిభద్రతలు కాపాడామని పేర్కొన్నారు.

'యాదాద్రి.. భూలోక వైకుంఠంగా విరాజిల్లుతోంది. యాదాద్రి పునర్నిర్మాణం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమే. కొత్త సచివాలయం తెలంగాణ పునర్నిర్మాణానికి నిలువెత్తు సాక్ష్యం. ప్రపంచ ఇంజినీరింగ్ అద్భుతాలు అనేలా ప్రాజెక్టులు కట్టుకున్నాం. కొత్త సచివాలయ ఆర్కిటెక్టులు, నిర్మాణ సంస్థకు ధన్యవాదాలు. నిర్మాణంలో చెమట చిందించిన ప్రతి శ్రామికుడికీ ధన్యవాదాలు.'-ముఖ్యమంత్రి కేసీఆర్

ఇవీ చదవండి:

Last Updated : Apr 30, 2023, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details