తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైఎస్సార్సీపీ నాలుగో జాబితాపై జగన్‌ కసరత్తు - నేతల్లో ఆందోళన - ఏపీలో అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ల మార్పు

CM Jagan Focus on YSRCP Fourth List Candidates: ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ల నాలుగో జాబితాపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. మూడు జాబితాల్లో 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించడంతో నాలుగో లిస్టులో ఇంకెంత మంది టికెట్లు గల్లంతు అవుతాయోనని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

CM_Jagan_Focus_on_YSRCP_Fourth_List_Candidates
CM_Jagan_Focus_on_YSRCP_Fourth_List_Candidates

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 4:54 PM IST

Updated : Jan 17, 2024, 7:55 PM IST

CM Jagan Focus on YSRCP Fourth List Candidates :ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ల నాలుగో జాబితాపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. మూడు జాబితాల్లో 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించడంతో నాలుగో లిస్టులో ఇంకెంత మంది టికెట్లు గల్లంతు అవుతాయోనని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఇంఛార్జుల మార్పుపై చర్చలు : పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జులు మార్పులతో సీఎం జగన్‌ నాలుగో జాబితా సిద్ధం చేస్తున్నారు. మార్పుల విషయమై పలువురు వైకాపా ఎమ్మెల్యేలు, నేతల తాడేపల్లి క్యాంపు కార్యాలయం సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డిని కలిశారు. సజ్జల, ధనుంజయ రెడ్డి ఎమ్మెల్యేలతో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుపై చర్చించారు.

వైఎస్సార్సీపీ నాలుగో జాబితాపై నేతల్లో ఆందోళన - ఈ సారి కరివేపాకులు ఎవరో?

ఎట్టకేలకు బాలినేనికి జగన్ దర్శన భాగ్యం : బాలినేని కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. తన ప్రమేయం లేకుండా ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చడంపై బాలినేని ఆగ్రహంగా ఉన్నారు. గిద్దలూరు, దర్శి, కొండేపి ఇంఛార్జుల నియామకంలో తన మాట పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పైగా ఒంగోలు ఎంపీ సీటు మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నప్పటికీ సీఎం నుంచి సానుకూల స్పంధన రాలేదు. తన నియోజకవర్గంలో పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి నిధులు కేటాయించాలని పలుమార్లు కోరినా ఫలితం లేకుండా పోయింది.

వైఎస్సార్సీపీ మునిగి పోతున్నా జగన్ మేకపోతు గాంభీర్యం!

అంతేకాక తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని ప్రోత్సహిస్తున్నారని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిపై కలిసేందుకు అంతకుముందు సీఎం అవకాశం ఇవ్వకపోవడంతో బాలినేని అలక బాట పట్టారు. కొద్దిరోజులుగా జిల్లాలో ఎవరికీ అందుబాటులోకి రాకుండా హైదరాబాద్‌కి వెళ్లారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల జరిగిన వైసీపీ సమావేశాలకు కూడా ఆయన గైర్హాజరయ్యారు. సీఎంవో సహా ముఖ్యనేతల సంప్రదింపులతో ఎట్టకేలకు బాలినేని తాడేపల్లికి వచ్చారు. తొలుత ధనుంజయరెడ్డి, ముఖ్యనేతలతో మంతనాలు జరిపారు. అనంతరం సీఎం జగన్‌ని కలిసి పలు అంశాలపై చర్చించారు.

వైఎస్సార్సీపీలో గొంతెత్తి ప్రశ్నిస్తే - వేటేస్తారు జాగ్రత్త సుమీ!

Last Updated : Jan 17, 2024, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details