CM Basavaraj Bommai: రాష్ట్రంలో ఇకపై అన్నీ మంచి రోజులే రానున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. తుమకూరు జిల్లాలో బిదనగెరె బసవేశ్వర మఠం ప్రతిష్టించిన 161 అడుగుల ఎత్తైన పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. జిల్లాలో రామ నవమి సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయని, రానున్న రోజుల్లో ఎన్నో అభివృద్ధి పనులు జరగనున్నాయని తెలిపారు.
'ఇకపై అన్నీ మంచి రోజులే'.. 161 అడుగుల విగ్రహం ఆవిష్కరించిన సీఎం - Panchamukhi Anjaneya Swamy statue unveiled in karnataka
CM Basavaraj Bommai: ఇక నుంచి అన్నీ మంచి రోజులే రానున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. తుమకూరు జిల్లాలో బిదనగెరె బసవేశ్వర మఠం ప్రతిష్టించిన 161 అడుగుల ఎత్తైన పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
బసవరాజ్ బొమ్మై
'ఆంజనేయ స్వామి ప్రతిరూపాల్లో పంచముఖి ఆంజనేయ రూపం ఎంతో ప్రత్యేకమైనది. రామాయణంలో ఈ రూపం ప్రత్యేకతను వివరించారు. ప్రపంచ శ్రేయస్సును కాంక్షించి హనుమ.. ఈ రూపాన్ని ధరించాడని చెబుతారు. రాష్ట్రంలో 161 అడుగుల హనుమంతుని విగ్రహం ప్రతిష్టించడం దేవుని సంకల్పమే. విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేశారు.' అని సీఎం అన్నారు.
ఇదీ చదవండి:'వ్యాక్సిన్ 3.0' షురూ.. 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రికాషన్ డోస్