Clove stuck in lungs: ఏడేళ్ల కిందట ఎప్పుడో తిన్న లవంగం అలాగే ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయింది. ఫలితంగా మధ్యప్రదేశ్ ఇందోర్‌కు చెందిన 36 ఏళ్ల అనూషను ఎన్నో సమస్యలు వేధించాయి. బరువు తగ్గడం, తీవ్రమైన దగ్గు, ఉమ్మిలో రక్తం వంటివి ఇబ్బందిపెట్టాయి.
అనూష రెండేళ్లుగా విపరీతమైన దగ్గుతో బాధపడుతోంది. ఎన్ని పరీక్షలు చేసినా, మందులు వాడినా సమస్య తీరలేదు. దీనికి తోడు 3 నెలలుగా దగ్గుతో పాటు ఉమ్మి వేస్తుంటే రక్తం కూడా వచ్చేది. ఇది క్యాన్సరేనని ఆమె ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు. అనంతరం.. సమస్య ఇంకా తీవ్రమైంది.
ఇందోర్ వైద్యులు ఆమెకు సీటీ స్కాన్ సహా ఇతర పరీక్షలు చేసి క్యాన్సర్ సంకేతాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లో కణితిని గుర్తించారు. అప్పుడే అసలు నిజం బయటపడింది.
క్యాన్సర్ కాదు.. లవంగం..