తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్ధవ్,​ ఫడణవీస్​ మధ్య రహస్య భేటీ! - ఉద్ధవ్‌ ఠాక్రే

మహారాష్ట్ర ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడణవీస్, సీఎం ఉద్ధవ్​ ఠాక్రే రహస్యంగా సమావేశమయ్యారు. కేంద్రమంత్రి నారాయణ్ రాణే.. ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో వీరివురి భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Fadnavis
ఫడణవీస్

By

Published : Aug 28, 2021, 5:03 AM IST

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రేతో.. ఆ రాష్ట్ర ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడణవీస్ రహస్యభేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఓబీసీ రిజర్వేషన్​ విషయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఉద్ధవ్ ఠాక్రే. శుక్రవారం సహ్యాద్రీ గెస్ట్​హౌస్​లో ఈ సమావేశం జరిగింది.

అఖిలపక్ష సమావేశం అనంతరం.. ఉద్ధవ్​, ఫడణవీస్​లు అరగంట పాటు రహస్యంగా సమావేశం అయ్యారు. కేంద్రమంత్రి నారాయణ్ రాణే అరెస్టు తర్వాత రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే.. కేంద్రమంత్రి నారాయణ్ రాణే.. ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో వీరివురి భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అంతకుముందు.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ్‌ రాణెపై ఎలాంటి చర్యలు చేపట్టకూడదని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నాసిక్​ పోలీసులకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్​ 17కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details