బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న స్టీమర్ ప్రమాదానికి గురైంది. నీతీశ్.. పట్నాలోని గంగా ఘాట్లను పరిశీలించేందుకు పడవలో ప్రయాణిస్తున్నారు. అయితే ఆ పడవ.. గంగా నదిలోని జేపీ బ్రిడ్జ్ పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో నీతీశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఛఠ్‌పూజకు వేడుకలకు గంగా నదిలోని ఘాట్లను పరిశీలించేందుకు నీతీశ్ పట్నాకు వెళ్లారు. నీతీశ్ కుమార్ సహా ఇతర అధికారులు వివిధ పడవలో ఘాట్లను సందర్శించారు. ప్రతి ఏడాది ఛఠ్ పూజలకు ముందు గంగా ఘాట్లను ముఖ్యమంత్రి నీతీశ్ స్వయంగా పర్యవేక్షిస్తారు.