సినీ నటి, భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్‌కు ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారును ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్‌బెలూన్స్ తెరుచుకోవడంతో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయం గురించి తెలియజేస్తూ ఖుష్బూ తాజాగా ఓ ట్వీట్ పెట్టారు.
ఖుష్బూకు తృటిలో తప్పిన ప్రమాదం - bjp leader khushboo car accident
సినీనటి, భాజపా నాయకురాలు ఖుష్బూకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్‌బెలూన్స్ తెరుచుకోవడంతో ఆమె సురక్షితంగా బయటపడ్డారు.
నటి కుష్భు కారుకు ప్రమాదం
‘కడలూరు వెళ్తుండగా మార్గమధ్యంలో మెల్మర్వతూర్ వద్ద మేం ప్రయాణిస్తున్న కారుని ట్యాంకర్ ఢీ కొట్టింది. దేవుడి దయ వల్ల సురక్షితంగా బయటపడ్డాం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు’ అని ఖుష్బూ పేర్కొన్నారు. కారులో ఎవరెవరు ప్రయాణిస్తున్నారన్న వివరాలు తెలియరాలేదు.
Last Updated : Nov 18, 2020, 11:50 AM IST