బిహార్‌లో హనీట్రాప్ ఘటన వెలుగుచూసింది. ముజఫర్‌పుర్ జిల్లా కాట్రా రిజిస్ట్రార్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న రవి చౌరాసియా అనే వ్యక్తి దేశానికి సంబంధించిన రహస్య పత్రాలను పాకిస్థాన్‌కు చెందిన గూఢాచారి సంస్థ ఐఎస్ఐకు లీక్ చేశాడనే ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. జాతీయ భద్రతా సంస్థ ఆదేశాల మేరకు క్లర్క్‌ను అరెస్టు చేసినట్లు ముజఫర్‌పుర్ సీనియర్ ఎస్పీ జయంత్ కాంత్ తెలిపారు. నిందితుడు.. ముంగర్ జిల్లాకు చెందిన వ్యక్తి అని ఆయన తెలిపారు.
హనీ ట్రాప్‌లో రక్షణ శాఖ మాజీ ఉద్యోగి.. కీలక సమాచారం పాకిస్థాన్‌కు..
ఐఎస్ఐకు చెందిన మహిళ వలపు వలలో పడ్డాడు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి. హనీ ట్రాప్‌లో పడిన వ్యక్తి దేశానికి సంబంధించిన కీలక రహస్య పత్రాలను లీక్ చేశాడు.
పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ గూఢాచారి సంస్థకు పనిచేసే ఓ మహిళా ఏజెంట్.. నిందితుడిని ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుంది. అంతకుముందు నిందితుడు చెన్నై ఆవడీలోని రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్‌గా పనిచేసేవాడు. అక్కడి నుంచి కూడా రహస్య సమాచారాన్ని గూఢాచారులకు పంపేవాడని తేలింది. అతడి ఫోన్ కాల్స్ డేటా, ఈమెయిల్స్, వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలించిన పోలీసులు.. నేరానికి పాల్పడినట్లుగా నిర్ధరణకు వచ్చారు. వీటి ఆధారంగా అతడిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితుడి మొబైల్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. అతను భారత ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్‌ఐకి పంపుతున్నట్లు గుర్తించింది సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దాని ఆధారంగానే రవిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
"ఇప్పటి వరకు విచారణలో నిందితుడి నుంచి ఎటువంటి సమాచారం వచ్చినా, దానిని భారత ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో పంచుకున్నాము. మున్ముందు ఎలాంటి సమాచారం వచ్చినా దర్యాప్తు సంస్థల సమన్వయం ముందుకెళ్తాము. ఈ సహకారం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. దీనిపై పూర్తి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటాము" అని ముజఫర్‌పూర్ సీనియర్ ఎస్పీ జయంత్ కాంత్ తెలిపారు.