సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ను ఈ నెల 31న ప్రకటించనుంది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఆ శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియల్.
"2021లో నిర్వహించనున్న సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయో.. డిసెంబర్ 31న ప్రకటిస్తాం" అని ట్వీట్ చేశారు పోఖ్రియల్.