ఉత్తర్ప్రదేశ్లో వరుస అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఫతేపుర్లో తొమ్మిదో తరగతి బాలికపై, అదే పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి అత్యాచారం చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఏం జరిగిందంటే?
ఉత్తర్ప్రదేశ్లో వరుస అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఫతేపుర్లో తొమ్మిదో తరగతి బాలికపై, అదే పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి అత్యాచారం చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఏం జరిగిందంటే?
హథ్గామ్లోని 15 సంవత్సరాల బాలిక 9వ తరగతి చదువుతోంది. పాఠశాల అయిపోగానే ఇంటికి వెళ్తున్న సమయంలో సీనియర్ విద్యార్థి.. తనను బలవంతంగా అటవీ ప్రాంతంలోనికి లాక్కెళ్లి, అత్యాచారం చేశాడని బాధిత బాలిక ఆరోపించింది. నిందితుడు తమ వీధికి చెందిన వాడేనని, అదే స్కూల్లో పదో తరగతి చదుతున్నాడని పోలీసులకు చెప్పిందా విద్యార్థిని.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితునిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు.
ఇదీ చదవండి:అత్యాచారం జరిగిన 27 ఏళ్లకు కేసు పెట్టిన బాధితురాలు